మొదటి టర్మ్ పరీక్షల్లో రాణించని విద్యార్థుల కోసం కొత్త ప్రోగ్రామ్
- January 16, 2023
యూఏఈ: మొదటి టర్మ్ పరీక్షల ముగింపులో మెరుగైన పనితీరు కనబరచని లేదా ఉత్తీర్ణత గ్రేడ్‌ను పొందని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మద్దతుగా కొత్త ప్రోగ్రామ్ ను ప్రారంభించినట్లు ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ (ESE) ప్రకటించింది. మొదటి సెమిస్టర్లో ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులకు రెండవ అవకాశం కల్పించడమే విద్యార్థులకు మద్దతు, సాధికారత కార్యక్రమం లక్ష్యం అని ESE డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ మహ్మద్ అల్ ఖాసిమ్ అన్నారు. 3వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని వర్తింపజేయనున్నట్లు ఆయన వివరించారు. మొదటి టర్మ్ పరీక్షలలో మొత్తం 50 శాతం కంటే తక్కువ గ్రేడ్ పొందిన మొదటి, రెండవ సైకిల్స్‌లోని విద్యార్థులు ప్రోగ్రామ్‌లో చేరేందుకు అర్హులన్నారు. అలాగే, మూడవ సైకిల్లో మొత్తం 60 శాతం కంటే తక్కువ గ్రేడ్ని పొందిన విద్యార్థులు జనవరి 23న ఫిబ్రవరి 3 వరకు అందుబాటులోకి తీసుకురానున్న ప్రోగ్రామ్ నుండి ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. 9 నుండి 12 తరగతులతో సహా మినిస్టీరియల్ పాఠ్యాంశాలను అనుసరించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు పరీక్షల ఫలితాలను ESE జనవరి 9న ప్రకటించింది. 5 నుంచి 8వ తరగతి విద్యార్థుల ఫలితాలను జనవరి 10న ప్రకటించగా, 1 నుంచి 4వ తరగతి ఫలితాలను జనవరి 11న ప్రకటించారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







