వాహనదారులకు అలర్ట్.. అల్-గజాలి రోడ్డు 10 రోజుల పాటు మూసివేత

- January 18, 2023 , by Maagulf
వాహనదారులకు అలర్ట్.. అల్-గజాలి రోడ్డు 10 రోజుల పాటు మూసివేత

కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ (PART) వాహనదారులకు కీలక సూచనలు చేసింది. షువైఖ్ పోర్ట్ వైపు అల్-గజాలి రోడ్డును 10 రోజుల పాటు మూసివేయనున్నట్లు ప్రకటించింది. రోడ్డు మూసివేత ఉత్తర్వులు జనవరి 16 నుండి జనవరి 26 వరకు రాత్రి సమయంలో అమలు అవుతాయని పేర్కొంది. షువైఖ్ పోర్ట్ వైపు అల్-గజాలి రోడ్డును అర్ధరాత్రి 1:00  నుండి తెల్లవారుజామున 5:00 వరకు మూసివేయనున్నట్లు తెలిపింది. ఆ మార్గంలో కొనసాగుతున్న నిర్వహణ పనుల్లో భాగంగా మూసివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు అథారిటీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com