కువైట్ లో రికార్డు స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు

- January 18, 2023 , by Maagulf
కువైట్ లో రికార్డు స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు

కువైట్: కువైట్ లో ఒకేరోజు రికార్డు స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఈ నెల 16వ తేదీన( సోమవారం) 3,618 ట్రాఫిక్ ఉల్లంఘనలను జారీ చేసినట్లు సాధారణ ట్రాఫిక్ విభాగం వెల్లడించింది. ఇందులో 'నాయిస్ ఎగ్జాస్ట్' కోసం 32 ఉల్లంఘనలు, సైకిళ్లు-డెలివరీ వాహనాలపై 270 ఉల్లంఘనలు ఉన్నాయి. అలాగే ఆ రోజు 11 వాహనాలను కూడా సీజ్ చేసినట్లు తెలిపింది. వీటితోపాటు పాదచారుల వంతెనను ఉపయోగించిన ద్విచక్ర వాహనాలకు సంబంధించి 10 ఉల్లంఘనలు, ద్విచక్ర వాహనం-డెలివరీ వాహనాలకు సంబంధించి 270 ఇతర ఉల్లంఘనలు నమోదు చేయబడ్డాయని పేర్కొంది. తమ తనిఖీలు కొనసాగుతాయని, రహదారి వినియోగదారులందరూ ట్రాఫిక్ చట్టాలను పాటించాలని ట్రాఫిక్ విభాగం అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com