రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
- January 18, 2023
రియాద్: రియాద్ లో "రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం" కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలు మన సంస్కృతిని ప్రతిభించేలా సంక్రాంతి ప్రాముఖ్యతను తెలియజేస్తూ, చిన్న,పెద్దల ఆట పాటలతో ఘనంగా జరుపుకున్నారు.ఈ సంక్రాంతి పండుగ సౌజన్య భగవత్గీత ప్రవచనాలతో ప్రారంభించగా, సురేఖ సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
రోజంతా జరిగిన ఈ కార్యక్రమాలను తిరుపతి స్వామి స్వర్ణ (స్వామి), భాస్కర్ గంధవల్లి , మహేంద్ర వాకాటి, నటరాజ్ భూమెని, అనిల్ మర్రి, ఇబ్రహీం షేక్, నాగేంద్ర, శేషు బాబు, మురారి, RVP ప్రసాద్, ప్రసాద్ బోడె, శ్రీనివాస్ ముచ్చు, జిలాని షేక్ మరియు ఇతర మిత్రులు అన్నీ తామై నడిపించారు.
మన మహిళా మణులు నిరూప భూమెని, శ్రీదేవి వాకాటి, అనూష స్వర్ణ, బిందు గంధవల్లి, మను, మని, సింధు & టీం సభ్యులు ప్రాంగణాన్ని అందముగా తమ ముగ్గులతో అలంకరించి, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను దగ్గర ఉండి చూసుకున్నారు.
ఈ కార్యక్రమానికి నటరాజ్ & టీం ఆధ్వర్యంలో almarai కంపెనీ వారు మరియు వెంకట భాస్కర్ కొల్ల & టీం ఆధ్వర్యంలో JAL కంపెనీ వారు స్పాన్సర్లుగా వ్యహరించారు.
టోర్నమెంట్ మొదటి విజేత టీంకి ప్రైజ్ మనీ "సుఖేష్ & గుత్తు ఇండియన్ రెస్టారెంట్" చేతుల మీదగా అందించారు.రెండవ విజేత టీంకి ప్రైజ్ మనీ "ధన్యశ్రీ స్వర్ణ & రిషిత్ స్వర్ణ " చేతుల మీదగా అందించారు.మొదటి విజేత & రెండవ విజేత టీం సభ్యులకు మరియు క్రికెట్ టోర్నమెంట్ లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు బిందు భాస్కర్ ట్రోఫీ లను అందించగా, పిల్లలకు మరియు పెద్దలకు మెడల్స్ ను "నరేంద్ర పెళ్లూరు " అందించారు.ఆటగాళ్లను పెద్దలు నాగేశ్వరరావు మట్టపర్తి,ఎర్రన్న, వెంకటేశ్వర్లు దండా, ఆదినారాయణ దాసరి, అనిల్ మర్రి, దేవరాజ్, సతీష్ అభినందించారు.
ఈ సంక్రాంతి సంబరాలకు సహకరించిన అనిల్ మర్రి మరియు జవహర్ కు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.ముఖ్యంగా చిన్న పిల్లల నృత్యాలు అతిధులను మరియు సంక్రాంతి సంబరాలు-2023 కు విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.RVP ప్రసాద్ మరియు టీం చేసిన డాన్సులు అందరిని హుషారెక్కించాయి.
ఇలాంటి మన తెలుగు పండుగలను మరిన్ని జరుపుకుంటూ భావితరాల వారికి మన తెలుగు పండుగల యొక్క విశిష్టతను మరియు సంస్కృతిని తెలియజేయుటకు కమిటీ సభ్యులు కృషిచేస్తున్నారు.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరించింది.
"Riyadh Telugu People Help & Riyadh Telugu Help 2" అనే వాట్సాప్ గ్రూపుల ద్వారా మన తెలుగు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు అందిస్తూ, "Helping Hands Riyadh" అనే మరో వాట్సాప్ గ్రూపు ద్వారా ఆపదలో వున్న తెలుగు వారికి ఆర్ధిక సహాయము చేస్తున్నట్లు గ్రూప్ సభ్యులు తిరుపతి స్వామి స్వర్ణ (స్వామి), వెంకట్ యెల్లమెల్లి, మహేంద్ర వాకాటి, భాస్కర్ గంధవల్లి తెలియజేసారు.





తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







