నేపాల్ డాక్టర్ సందుక్ రూట్ కు ఇసా అవార్డు
- January 19, 2023
బహ్రెయిన్: అభివృద్ధి చెందుతున్న దేశాలలో అంధత్వాన్ని నయం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన నేపాల్ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ సందుక్ రూట్.. ప్రతిష్టాత్మకమైన ఇసా అవార్డుకు ఎంపికయ్యారు. ఈసా కల్చరల్ సెంటర్‌లో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇసా అవార్డ్ ఫర్ సర్వీస్ టు హ్యుమానిటీ సెక్రటరీ జనరల్ అలీ అబ్దుల్లా ఖలీఫా వెల్లడించారు. మానవాళికి సేవ కోసం పాటుపడిన వారికి 11 కేటగిరీలలో ఇసా అవార్డును అందజేస్తుంది.
డాక్టర్ సందుక్ రూట్ కంటిశుక్లం చికిత్సకు ఒక గొప్ప విధానాన్ని అభివృద్ధి పరచి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందారు. డాక్టర్ రూట్ తక్కువ-ఆదాయ రోగులకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేసారు. దాదాపు 120,000 మంది ప్రజల కంటి చూపును కాపాడగలిగారు. అలాగే, డాక్టర్ రూయిట్ తన స్వగ్రామంలో ఒక కర్మాగారాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం 350,000 కంటే ఎక్కువ లెన్స్‌లు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి లెన్స్‌ను $3 కే పంపిణీ చేస్తున్నారు. సాధారణ లెన్స్ ధర బహిరంగ మార్కెట్లో $100 ఉంది. డాక్టర్ రూట్ తన 30-సంవత్సరాల కెరీర్‌లో 50,000 కంటి శస్త్రచికిత్సలు చేశారు. భూటాన్, థాయిలాండ్, మయన్మార్, మంగోలియా, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇథియోపియా, బంగ్లాదేశ్, చైనా, ఇండియా వంటి దేశాలలో ఎంతోమంది వైద్యులకు శిక్షణ కార్యక్రమాలను, వైద్య క్యాంపులను నిర్వహించారు.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







