ఎవరేమనుకుంటే నాకేటి.! అదో గొప్ప అనుభూతి-శృతిహాసన్.!
- January 19, 2023
శృతిహాసన్ ఈ ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. రెండూ పెద్ద సినిమాలే. గతంలో ఎన్నడూ లేని విధంగా శృతిహాసన్‌కి ఇది బంపర్ ఆఫరే అని చెప్పొచ్చు.
అయితే, సినిమాలు రిలీజయ్యాకా శృతిహాసన్‌కి అంత సీను లేదంటూ పెదవి విరిచేశారు అభిమానులు. జస్ట్ గ్లామర్ డాళ్ అంతే.. అని తేల్చి పడేశారు.
ఎవరేమైనా అనుకోని.. ఈ సంక్రాంతి తన కెరీర్‌లో ది బెస్ట్ ఫెస్టివల్ అంటోంది శృతిహాసన్. ఎవరెంతలా కామెంట్ చేసుకున్నా డోంట్ కేర్ అంటోంది శృతిహాసన్.
‘వీరి సింహారెడ్డి’ విషయం పక్కన పెడితే, ‘వాల్తేర్ వీరయ్య’లో శృతిహాసన్ కోసం ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ డిజైన్ చేశారు. తెరపై ఆ ఎపిసోడ్ బాగానే వర్కువుట్ అయ్యింది. అలాగే, చిరంజీవితో శృతిహాసన్ పెయిర్ కూడా ఫ్రెష్‌గానే అనిపించిందన్న ప్రశంసలూ లేకపోలేదు.
ఇక్కడితో అయిపోలేదు శృతిహాసన్ పండగ. నెక్స్‌ట్ ‘సలార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదీ బిగ్గెస్ట్ ప్రాజెక్టే. ఈ లోపల ఇంకెన్ని ప్రాజెక్టులు ఓకే చేస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







