అయ్యో పాపం.! ఎన్టీయార్ హీరోయిన్‌కి ఎంత కష్టమొచ్చిందో సుమా.!

- January 19, 2023 , by Maagulf
అయ్యో పాపం.! ఎన్టీయార్ హీరోయిన్‌కి ఎంత కష్టమొచ్చిందో సుమా.!

ఎన్టీయార్ సరసన ‘యమదొంగ’ సినిమాలో లేడీ యముడి పాత్రలో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్. మంచి నటి. సింగర్ కూడా. అయితే, రియల్ లైఫ్‌లో మమతా మోహన్ దాస్ చాలా కష్టాలు అనుభవించింది.
ఒక్కసారి కాదు, ఏకంగా రెండు సార్లు క్యాన్సర్ బారిన పడి ధైర్యంగా ఆ ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కొంది మమతా మోహన్ దాస్. ఇప్పుడిప్పుడే తన కెరీర్‌పై దృష్టి పెడుతున్న క్రమంలో, మళ్లీ ఓ అనారోగ్య సమస్య ఆమెని వెంటాడుతోంది.
‘విటిలిగో’ అను అరుదైన చర్మ వ్యాధి బారిన పడ్డట్లుగా మమతా మోహన్ దాస్ తాజాగా సోషల్ మీడియాలో స్పందించింది. ఈ చర్మ వ్యాధి కారణంగా కాస్త కలర్ తగ్గిపోతారట. అలాగే, చర్మంపై అక్కడక్కడా తెల్లని మచ్చలు (బొల్లి తరహాలో) ఇబ్బంది పెడుతుంటాయట. అందాల భామలకు ఇది చాలా పెద్ద సమస్యే కదా.
పాపం.! మమతా మోహన్ దాస్‌కే ఎందుకిన్ని కష్టాలు.? అంటూ నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారామెపై.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com