అరబ్ లీడర్స్ కన్సల్టేటివ్ మీటింగ్‌లో పాల్గొన్న బహ్రెయిన్ రాజు
- January 19, 2023
అబుధాబి: అబుధాబిలో జరిగిన అరబ్ లీడర్స్ కన్సల్టేటివ్ మీటింగ్‌లో బహ్రెయిన్ రాజు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ మరింత స్థిరమైన, సంపన్నమైన భవిష్యత్తును నిర్మించడంలో ఉమ్మడి అరబ్ చర్యకు మద్దతు ఇవ్వడానికి బహ్రెయిన్ కట్టుబడి ఉందన్నారు. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నిన్న అబుధాబిలో యూఏఈ అధ్యక్షుడు హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒమన్ సుల్తాన్ హెచ్ఎం హైతం బిన్ తారిక్, ఖతార్ ఎమిర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, జోర్డాన్ రాజు హెచ్ఎం అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్, ఈజిప్ట్ ప్రెసిడెంట్ హెచ్ఇ అబ్దెల్ఫత్తా అల్ సిసీ కూడా పాల్గొన్నారు. "పాస్పరిటీ అండ్ స్టెబిలిటీ ఇన్ ద రిజియన్ " అనే థీమ్‌తో నిర్వహించిన ఈ సమావేశంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి, పురోగతి, శ్రేయస్సు, భవిష్యత్తులో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే అన్ని రంగాలలో ఆయా దేశాల మధ్య సోదర సంబంధాలు, సహకారం, సమన్వయం గురించి అరబ్ నాయకులు చర్చించారు.వీటితోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు, భాగస్వామ్య ఆసక్తి, రాజకీయ, భద్రత, ఆర్థిక సవాళ్ల గురించిన విషయాలపై కూడా సమీక్షించారు. దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే సూత్రాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా అరబ్ నేతలు నిర్ణయించారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







