రియాద్ సీజన్ కప్: థ్రిల్లర్ మ్యాచ్‌లో గెలిచిన పీఎస్జీ.. మెరిసిన రొనాల్డో
- January 20, 2023
రియాద్: ఉత్కంఠగా సాగిన రియాద్ సీజన్ కప్ లో మెస్సీ సారథ్యంలోని పారిస్ సెయింట్-జర్మైన్(పీఎస్జీ) జట్టు రోనాల్డో కెప్టెన్సీ వహించిన సౌదీ ఆల్-స్టార్ ఎలెవన్ జట్టును 5-4తో ఓడించింది. జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ (జీఈఏ) అధిపతి తుర్కీ అల్-షేక్ ముఖ్య అతిథిగా హాజరై విజేతకు ట్రోఫీ అందజేశారు. ఈ మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో అల్-నాస్ర్ క్లబ్‌కు మారిన తర్వాత సౌదీ అరేబియాలో మొదటిసారి దుమ్ములేపాడు. ఈ మ్యాచులో రొనాల్డో రెండు గోల్స్ చేయడంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ ఆధ్యంతం మెస్సీ, ఎంబాప్పే, నేయ్ మర్, రొనాల్డో తదితర ఫుట్ బాల్ స్టార్లు తమ ఆటతీరుతో అభిమనులను కట్టిపడేశారు.
రియాద్‌లోని కింగ్ ఫహద్ స్టేడియం 60,000 మంది అభిమానులతో నిండిపోయింది. అంతకుముందు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కిక్-ఆఫ్‌కు ముందు పిచ్‌లోని ఆటగాళ్లతో కరచాలనం చేసారు. ఫుట్ బాల్ లెజెండ్‌లైన థియరీ హెన్రీ, అల్లెసాండ్రో డెల్ పియరో, ఫ్రాన్సిస్కో టోటీ ఈ మ్యాచుకు హాజరై ఆలరించారు. మ్యాచ్ ప్రారంభమైన మూడో నిమిషంలో మెస్సీ మొదటి గోల్ చేయడంతో స్టేడియం మెస్సీ నామస్మరణతో దద్దరిల్లింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచులో అరగంట దాటిన తర్వాత రొనాల్డోను పిఎస్‌జి కీపర్ కీలర్ నవాస్ ఢీకొనడంతో మొఖంపై గాయమైంది. రియాద్ ఆల్-స్టార్ ఆటగాడు సేలం అల్ దవ్సారిని హాఫ్-వే లైన్ దగ్గర పీఎస్జీ ప్లేయర్ జువాన్ నెర్నాట్ దురుసుగా అడ్డుకోవడంతో రెడ్ కార్డుకు గురయ్యాడు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







