ఆయన కోసం ఈయన ‘విలన్’ అవుతాడా.?
- January 21, 2023
విలక్షణ పాత్రలకు ఎప్పుడూ ముందుంటాడు చియాన్ విక్రమ్.ఈ సారి ఓ స్టార్ హీరో కోసం ఈ మరో స్టార్ విలన్ కాబోతున్నాడట. ఇంతకీ ఎవరా స్టార్ హీరో.? ఏంటా కథ.?
వివరాల్లోకి వెళితే, విశ్వ నటుడు కమల్ హాసన్ లీడ్ రోల్లో వచ్చిన ‘విక్రమ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన జోష్తో ‘విక్రమ్’కి సీక్వెల్ రూపొందబోతోందన్న సంగతి కూడా తెలిసిందే.
అతి త్వరలోనే అంటే, ఈ ఏడాదిలోనే ‘విక్రమ్ 2’ మొదలెట్టబోతున్నారట. ఆ సినిమాకి సంబంధించి ఓ సరికొత్త గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాలో విక్రమ్ ఓ పవర్ఫుల్ రోల్ పోషించబోతున్నాడన్నదే ఆ గాసిప్ సారాంశం.
ఆల్రెడీ ఈ సీక్వెల్లో మెయిన్ విలన్గా రోలెక్స్ పాత్రలో సూర్య నటించబోతున్న విషయం మొదటి పార్ట్లోనే హింట్ ఇచ్చేశారు. తాజా గాసిప్ ప్రకారం, ‘విక్రమ్ 2’ లో మరో విలన్ వుండబోతున్నాడనీ, అది చియాన్ విక్రమ్ అనీ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







