పాస్‌వర్డ్ షేరింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం
- January 21, 2023
యూఏఈ: పాస్‌వర్డ్ షేరింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఫేమస్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఒకే ఖాతా ఉపయోగించే పరికరాలను ధృవీకరించనుంది.ఈ మేరకు ఫోర్బ్స్ తెలిపింది. మార్చి 2023 వరకు నెట్‌ఫ్లిక్స్ ఖాతాను ఉపయోగించే వారి పాస్‌వర్డ్ షేరింగ్ ను పరిమితం చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొంది. పరికరాన్ని ధృవీకరించడానికి నెట్‌ఫ్లిక్స్ ప్రాథమిక ఖాతా యజమాని ఇమెయిల్ లేదా ఫోన్ నంబర్‌కు లింక్‌ను పంపుతుంది. పరికరంలో కోడ్‌ని తప్పనిసరిగా 15 నిమిషాల్లో నమోదు చేయాలి. లేకుంటే దాని గడువు ముగుస్తుంది. ఒకవేళ గడువు ముగిసినట్లయితే, కొత్త కోడ్‌ను అభ్యర్థించాల్సి ఉంటుంది. కోడ్ ను సకాలంలో నమోదు చేయని వారి ఖాతాల పరికరం 'హౌస్‌హోల్డ్' వెలుపల ఉన్నదని నిర్ధారిస్తుంది. అప్పుడు మరో ఖాతాను కొనుగోలు చేయమని, లేదా ప్రత్యేక షేరింగ్ ఆప్షన్లను కొనుగోలు చేయాలని ఖాతాదారులను కోరతారని ఫోర్బ్స్ తెలిపింది.
తాజా వార్తలు
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ







