ఫాహాహీల్ ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధి: కువైట్‌లో రెండవ పొడవైన వంతెనకు ఆమోదం
- January 22, 2023
కువైట్: షేక్ జాబర్ వంతెన తర్వాత కువైట్‌లో రెండవ అతి పొడవైన వంతెనను నిర్మించడం ద్వారా ఫహాహీల్ ఎక్స్‌ప్రెస్‌వేను అభివృద్ధి చేయాలన్న పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ & ట్రాన్స్‌పోర్టేషన్ అభ్యర్థనను కువైట్ మునిసిపాలిటీ ఆమోదించింది. ఫ్లైఓవర్ కువైట్ సిటీ నుండి దక్షిణ సబాహియా ప్రాంతం వరకు 36 కి.మీ పొడవుతో ఉంటుంది. బ్రిడ్జిని ఫహాహీల్ ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానించడానికి 20 ర్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. అబూ అల్ హసానియా, ఫింటాస్, అబు హలీఫా, మన్కాఫ్, మహబౌలా, బయాన్, సబా అల్ సలేం, హవల్లి ప్రాంతం నుండి ఫహాహీల్ ఫ్లైఓవర్‌కు ప్రవేశాలు, ఎగ్జిట్ ల ఏర్పాటు ఉన్నది. ఇందులో 7 పాదచారుల వంతెనలు, బస్ స్టాప్‌లు కూడా ఉంటాయి. ఇతర ప్రధాన రహదారులతో ఫ్లైఓవర్ ను కలిపేందుకు సొరంగాలను నిర్మించనున్నట్లు సాంకేతిక అధ్యయనంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







