అరటి దోశ
- April 29, 2016
కావలసిన పదార్థాలు: బియ్యం - 2 కప్పులు, మినపప్పు - అరకప్పు, అరటిపండ్లు - 3, పంచదార - 1 టీ స్పూను, మెంతులు - రెండు చిటికెలు, పచ్చిమిర్చి - 2, నెయ్యి లేక వెన్న - కాల్చడానికి సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: బియ్యం, మెంతులు కలిపి 6 గంటలపాటు నానబెట్టి, నీరు వడకట్టి మెత్తగా రుబ్బుకోవాలి. పిండిలో కొద్దిగా వేడి నీరు, ఉప్పు కలిపి జారుగా చేసి మరో ఆరుగంటలు పక్కనుంచాలి. అరటిపళ్లని, పచ్చిమిర్చిని సన్నగా తరిగి, ఉప్పు, పంచదారతో పాటు పిండిలో కలిపి (దళసరిగా) దోశలు పోసుకొని రెండువైపుల దోరగా కాల్చుకోవాలి. పిల్లలు బాగా ఇష్టపడే దోశలివి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









