భారతదేశంలో కన్నుమూసిన ప్రముఖ వ్యాపారవేత్త జాన్ మాథ్యూ
- January 23, 2023
కువైట్: ప్రముఖ కమ్యూనిటీ సభ్యుడు, వ్యాపారవేత్త జాన్ మాథ్యూ భారతదేశంలో మరణించారు. ఆయనకు 84 ఏళ్లు. దాదాపు 60 ఏళ్లుగా కువైట్‌లో ఉన్న ఆయన గత ఏడాది ఆగస్టులో కువైట్‌ను విడిచి భారతదేశానికి వెళ్లారు. జాన్ మాథ్యూ 60వ దశకంలో విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖలో చేరారు. అలాగే కువైట్‌లోని వివిధ సంస్థల బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. NRIల కోసం కేరళ ప్రభుత్వ నోర్కా(NORKA) ప్రాజెక్ట్‌కి అధికారిక ప్రతినిధిగా కూడా మాథ్యూ పనిచేశారు. గత సంవత్సరం కువైట్‌ను విడిచిపెట్టిన తరువాత, అతను కేరళలోని ఎర్నాకులంలో రిటైర్డ్ జీవితాన్ని గడుపుతున్నాడు. జాన్ మాథ్యూకు భార్య రమణి, పిల్లలు అన్నా, సారా, మరియాలు ఉన్నారు.
తాజా వార్తలు
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!







