యూఏఈ.. వారాంతంలోనూ కొనసాగనున్న వర్షాలు?
- January 27, 2023
యూఏఈ: యూఏఈలో వరుసగా రెండో రోజు కూడా వర్షాలు కొనసాగాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాంలు అయినట్లు రిపోర్టులు వచ్చాయి. అలాగే చాలా పాఠశాలలు రిమోట్ లెర్నింగ్‌కు మారాయి. అబుదాబి, షార్జా, దుబాయ్ (హట్టా), రస్ అల్ ఖైమా, ఫుజైరాలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) తెలిపింది. శుక్రవారం మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, వాతావరణం మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉందని ప్రకటించింది. తీరప్రాంతం, ఉత్తర, తూర్పు ప్రాంతాలలో వర్షపాతం కురుస్తుందని పేర్కొంది. అధేవిధంగా ఆదివారం లేదా సోమవారం కూడా ఆకాశం మేఘావృతమై ఉన్నా అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉంటుందని, పలు ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని NCM అంచనా వేసింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







