ఐఎల్ఏ ఆధ్వర్యంలో ఘనంగా 74వ భారత గణతంత్ర వేడుకలు
- January 27, 2023
బహ్రెయిన్: దాదాపు రెండేళ్ల అనంతరం 74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని బహ్రెయిన్ లోని ఇండియన్ లేడీస్ అసోసియేషన్(ILA) ఘనంగా జరుపుకుంది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తితో కూడిన లైవ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్‌లను నిర్వహించారు. సీఫ్‌లోని రామీ గ్రాండ్ హోటల్లో వేడుకలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా క్విజ్లు, ఆటలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసినట్లు ది ఇండియన్ లేడీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధీర్ పాసి తెలిపారు. మధ్యప్రాచ్యంలోని అతిపురాతనమైన లాభాపేక్షలేని సంస్థలలో ఐఎల్ఏ ఒకటి. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు సహాయం చేయడానికి అనేక ప్రాజెక్ట్‌లలో ఈ సంస్థ పని చేస్తుంది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







