‘వాము’తో నొప్పులకు పెట్టేయండి చెక్.!
- January 27, 2023నిజానికి మన వంటిల్లే పెద్ద మెడికల్ షాప్. ముఖ్యంగా పోపుల డబ్బా. పోపుల డబ్బాలోని ప్రతీ ఐటెమ్ ఒక ఔషధమే. శరీరానికి ఎలాంటీ హానీ చేయవు. ఏదైనా అననుకూల పరిస్థితులు తలెత్తితే, వెంటనే వాటికి ఉపశమనం కలిగించడానికి ఫస్ట్ ఎయిడ్ మాదిరి ఉపయోగపడుతుంటాయ్ పోపుల డబ్బాలోని ఐటెమ్స్.
పోపుల డబ్బాలో ఇంపార్టెంట్ ఐటెం ‘వాము’. వంటకు రుచి కలిగించేందుకు వామును వాడుతుంటారు. కేవలం రుచి మాత్రమే కాదు, వాము ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమైనది. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
గ్యాస్ నొప్పులు, కడుపు నొప్పుల నుంచి వాము ఉపశమనం ఇస్తుంది. వాము రసం తాగడం ద్వారా ఆయా గ్యాస్ నొప్పులు తగ్గుతాయ్.
అలాగే, మైగ్రేన్ వంటి తలనొప్పులకీ వాము రసం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణను మెరుగు పరచడం, జాయింట్ పెయిన్స్ నుంచి ఉపశమనం పొందేందుకు వాము చక్కగా ఉపకరిస్తుంది. మగ వారికి వీర్య కణాల వృద్ధితో పాటూ, దంతస్రావం, చిగుళ్ల వాపు, నోటి దుర్వాసనను తగ్గించేందుకు చక్కగా వుపయోగపడుతుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు