బలూచిస్థాన్ లో ఘోర ప్రమాదం..
- January 29, 2023
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్, లాస్బెలాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్యాసింజర్ కోచ్ లోయలో పడి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్యాసింజర్ కోచ్ క్వెట్టా నుంచి కరాచీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వివరించారు. లాస్బెలాలో ప్యాసింజర్ కోచ్ యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో ఓ బ్రిడ్జి పిల్లర్ ను ఢీ కొట్టిపడిపోయిందని తెలిపారు.
ఆ తర్వాత ప్యాసింజర్ కోచ్ కు మంటలు అంటుకున్నాయని చెప్పారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారని తెలిపారు. కోచ్ నుంచి ఓ మహిళ, ఓ చిన్నారి సహా ముగ్గురిని ప్రాణాలతో రక్షించారని చెప్పారు. కోచ్ అధిక వేగంతో వెళ్లడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మంటలు అంటుకున్న కోచ్ లో నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నామని, అవి గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయని వివరించారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఇచ్చే వివరాలు తీసుకుని వాటికి డీఎన్ఏ పరీక్షలు చేసి గుర్తిస్తామని చెప్పారు. పాకిస్థాన్ లో పదే పదే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







