బహ్రెయిన్‌లో SMEలపై 348% పెరిగిన సైబర్‌ అటాక్స్

- January 30, 2023 , by Maagulf
బహ్రెయిన్‌లో SMEలపై 348% పెరిగిన సైబర్‌ అటాక్స్

బహ్రెయిన్: ఎవరైనా ఆన్‌లైన్‌లో ఉచిత బహుమతులు లేదా ఇతర ప్రోత్సాహకాలను ఆఫర్ చేసినప్పడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలని, ఇది మిమ్మల్ని తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక నష్టాల్లోకి నెట్టవచ్చని రాజ్యంలోని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద సందేశాలు లేదా ఫోన్ కాల్‌ల పట్ల అప్రమత్తంగా ఉండటమే ఏకైక మార్గం అని సూచిస్తున్నారు. గతేడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య బహ్రెయిన్‌లోని చిన్న వ్యాపారాలపై సైబర్‌ అటాక్‌లలో 348% పెరుగుదల నమోదైందని పరిశోధనా సంస్థ కాస్పెర్స్కీ వెల్లడించింది. 2022 ప్రథమార్థంలో ప్రపంచవ్యాప్తంగా 236.1 మిలియన్ల సైబర్ దాడులు జరిగాయని యూకే ఆధారిత AAG IT సర్వీసెస్ నివేదిక పేర్కొంది. NGN ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు,సీఈఓ యాకూబ్ అలవాది మాట్లాడుతూ.. సైబర్‌ సెక్యూరిటీ ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన బహ్రెయిన్‌ కూడా సైబర్ అటాక్ ల నుంచి తప్పించుకోలేదని పేర్కొన్నారు. మోసపూరిత సందేశాలు, అనుమానిత లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అటువంటి లింక్‌లను ఎప్పుడూ ట్యాప్ చేయవద్దని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com