1,500 మందిని తొలగించిన బైజూస్
- February 02, 2023
న్యూ ఢిల్లీ: వివిధ టెకీ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్, గూగుల్ వంటి సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎడ్యుటెక్ కంపెనీ అయిన బైజూస్ కూడా భారీగా ఉద్యోగుల్ని తొలగించింది.
ఇంజనీరింగ్ రోల్స్‌కు సంబంధించి దాదాపు 15 శాతం ఉద్యోగుల్ని తొలగించింది. మొత్తంగా 1,500 వరకు ఉద్యోగుల్ని బైజూస్ తీసేసినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని కంపెనీకి చెందిన ఇంజనీరింగ్ టీమ్ కూడా తెలిపింది. సీనియర్ ఉద్యోగుల్నే కాకుండా, ఇటీవల కొత్తగా ఎంపికైన వారిని కూడా కంపెనీ తొలగించింది. ప్రధానంగా డిజైన్, ఇంజనీరింగ్, ప్రొడక్షన్ విభాగాల నుంచి ఎక్కువ తొలగింపులు జరిగాయి. అయితే, ఎంత మంది ఉద్యోగుల్ని కంపెనీ తొలగించింది అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఉద్యోగాల తొలగింపు వల్ల ఏర్పడే ఖాళీని భర్తీ చేసేందుకు కూడా కంపెనీ ప్రణాళికలు రూపొందించింది.
అనేక కార్యకలాపాల్ని ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వాలని కంపెనీ యోచిస్తోంది. ఆపరేషన్స్, లాజిస్టిక్స్, కస్టమర్ కేర్, ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ విభాగాలకు చెందిన బాధ్యతల్ని ఔట్‌సోర్స్‌కు ఇవ్వాలని కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం. ఉద్యోగుల్ని ఆఫీసులకు పిలిచి, పింక్ స్లిప్స్ చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. మరో సంస్థ పింటరెస్ట్ కూడా ఉద్యోగుల్ని తొలగించింది. గత డిసెంబర్‌లోనే పింటరెస్ట్ కంపెనీ కొందరు ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా మరో 150 మందిని తీసేసినట్లు సమాచారం. అయితే, ఎంత మందిని తొలగించిందో కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్