యూఏఈలో ఉచితంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌లు
- February 03, 2023
యూఏఈ: బ్రెస్ట్ క్యాన్సర్‌ను అరికట్టడం, అవగాహన పెంచడమే లక్ష్యంగా పింక్ కారవాన్ రైడ్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా యూఏఈలో ఉచితంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌లు చేస్తుంది. ఏడు రోజుల జాతీయ రైడ్‌లో మొబైల్ క్లినిక్‌లలో మామోగ్రఫీ యూనిట్ల ద్వారా మొత్తం ఏడు ఎమిరేట్స్‌లో ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌లను చేస్తున్నారు. జనవరి 20న ప్రారంభమైన ఈ సేవలు ఫిబ్రవరి 10తో ముగియనున్నవి. స్పెషల్ స్క్రీనింగ్‌ల మొబైల్ క్లినిక్‌లు, మినీవ్యాన్లు ఫిబ్రవరి 4న షార్జా, అజ్మాన్‌లలో ప్రారంభమై ఫిబ్రవరి 10న అబుధాబిలో తమ పర్యటనను ముగిస్తాయి.
రూట్ మ్యాప్
ఫిబ్రవరి 4న షార్జాలోని అల్ హీరా బీచ్‌లో ఉదయం 9 - 1 గంటల వరకు, అజ్మాన్‌లో అల్ జోరా బీచ్‌లో సాయంత్రం 4-10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 5న దుబాయ్‌లో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గ్లోబల్ విలేజ్‌లో.. ఫిబ్రవరి 6 జీరో 6 మాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.. ఫిబ్రవరి 7న కైట్ బీచ్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొబైల్ క్లినిక్‌లు సేవలు అందిస్తాయి. ఫుజైరా కార్నిచ్‌లో ఫిబ్రవరి 8న మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.. రస్ అల్ ఖైమాలోని మినా అల్ అరబ్‌లో ఫిబ్రవరి 9న మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 7 వరకు.. అబుధాబి జాయెద్ స్పోర్ట్స్ సిటీలో ఫిబ్రవరి 10న సాయంత్రం 5 గంటల నుంచి సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







