సిరియా, టర్కీలకు dhs50 మిలియన్లు ప్రటించిన షేఖా ఫాతిమా

- February 10, 2023 , by Maagulf
సిరియా, టర్కీలకు dhs50 మిలియన్లు ప్రటించిన షేఖా ఫాతిమా

యూఏఈ: భూకంప ధాటికి తీవ్రంగా నష్టపోయిన టర్కీ, సిరియాలకు హర్ హైనెస్ షేఖా ఫాతిమా బింట్ ముబారక్, జనరల్ ఉమెన్స్ యూనియన్ (GWU), సుప్రీం కౌన్సిల్ ఫర్ మదర్‌హుడ్ అండ్ చైల్డ్‌హుడ్ చైర్‌వుమన్, ఫ్యామిలీ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ సుప్రీం చైర్‌వుమన్, ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ (ERC) గౌరవ అధ్యక్షురాలు షేఖా ఆపన్న హస్తం అందజేశారు. సిరియా, టర్కీలో భూకంప బాధిత ప్రజల కోసం కొనసాగుతున్న మానవతా, సహాయక చర్యలకు మద్దతుగా ERC ప్రారంభించిన బ్రిడ్జ్ ఆఫ్ గుడ్‌నెస్ ప్రచారానికి మద్దతుగా శరణార్థి మహిళల కోసం ఫాతిమా ఫండ్ 50 మిలియన్ దిర్హామ్ లను అందించనున్నట్లు ప్రకటించారు. వేలాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసిన భూకంపాల పరిణామాలను తగ్గించడానికి యూఏఈ నాయకత్వ చేపట్టిన కార్యక్రమాలకు తమ మద్దతు కొనసాగుతుందని షేఖా ఫాతిమా పేర్కొన్నారు. విపత్తుల సమయంలో యూఏఈ మానవతా చొరవ బాధితులకు  కొంతైనా సాంత్వన కలిగిస్తుందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com