ప్రవక్త మస్జీదు ప్రాంగణంలోకి ప్రవేశించిన ఇద్దరు ముస్లిమేతర మహిళలు

- February 10, 2023 , by Maagulf
ప్రవక్త మస్జీదు ప్రాంగణంలోకి ప్రవేశించిన ఇద్దరు ముస్లిమేతర మహిళలు

మదీనా : ప్రవక్త మస్జీదు ప్రాంగణంలోకి ఇద్దరు ముస్లిమేతర మహిళలు ప్రవేశించారని, ఇది పొరపాటున జరిగిందని మదీనాలోని ప్రవక్త మస్జీదు వ్యవహారాల ఏజెన్సీ ప్రకటించింది., ఫిబ్రవరి 7న(మంగళవారం) జరిగిన ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయబడిన దానికి ప్రతిస్పందనగా ఏజెన్సీ వివరణ వచ్చింది. ‘‘ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మస్జీదు ప్రత్యేకత, పవిత్రత గురించి మహిళలకు వివరించిన తర్వాత వారు జ్ఞానోదయం పొందారు. ప్రెసిడెన్సీ సిబ్బంది వారికి ఇచ్చిన సూచనలు వారు అర్థం చేసుకోవడంలో పొరబాటు జరిగింది. తమకు అవగాహన కల్పించిన ప్రెసిడెన్సీ సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.” అని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సంఘటన తెలియజేసిందన్నారు. అలాగే పవిత్ర స్థలం పవిత్రత, ప్రత్యేకతపై అవగాహన, మార్గదర్శకత్వం, విధానాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరాన్ని కూడా తెలియజేసిందని ప్రవక్త మస్జీదు వ్యవహారాల ఏజెన్సీ స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com