దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లాను కొనుగోలు చేసిన భారతీయ కుటుంబం

- February 10, 2023 , by Maagulf
దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లాను కొనుగోలు చేసిన భారతీయ కుటుంబం

దుబాయ్‌: దుబాయ్‌లో లగ్జరీ ప్రాపర్టీలకు ఫుల్ డిమాండ్ ఉంది. ఓ భారతీయ కుటుంబం తిలాల్ అల్ ఘఫ్‌లో ఓ విల్లాను Dh90.5 మిలియన్లకు కొనుగోలు చేసినట్లు మెట్రోపాలిటన్ ప్రీమియం ప్రాపర్టీస్ తెలిపింది. 30,200 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఉబెర్-లగ్జరీ విల్లాను కెల్లీ హోపెన్ ఇంటీరియర్ డిజైనింగ్‌ అవార్డు-విజేత ఆర్కిటెక్చరల్ సంస్థ సహోట(SAOTA) రూపొందించింది. మూడు అంతస్తులు ఉన్న ఈ విల్లాలో ఎనిమిది పడకగదులు ఉన్నాయి. ఈ ప్రైమ్ ప్రాపర్టీలో మూడు స్విమ్మింగ్ పూల్స్, జిమ్, రిసెప్షన్, 24x7 సెక్యూరిటీ, ప్రత్యేక గెస్ట్ విల్లా ఉన్నాయి. పామ్ జుమేరాలో ఇలాంటి విల్లా కనీసం 250 మిలియన్ దిర్హామ్‌ల విలువ ఉంటుందని  మెట్రోపాలిటన్ ప్రీమియం ప్రాపర్టీస్‌లో సేల్స్ మేనేజర్ ఒబేయక్ శంసిద్దినోవ్ తెలిపారు. తిలాల్ అల్ ఘఫ్ అనేది దుబాయ్‌లో మజిద్ అల్ ఫుట్టైమ్ అభివృద్ధి చేసిన గెటేడ్ కమ్యునిటీ. పాఠశాలలు, ఆసుపత్రులు, రెస్టారెంట్లు, ఇతర గృహ సదుపాయాలతో పాటుగా 350,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణం కలిగిఉంది. ప్రాజెక్ట్ 70,000 చదరపు మీటర్ల నీటి ఒడ్డున విస్తరించి ఉన్న హైవ్ బీచ్ అని పిలువబడే ఓపెన్ బీచ్ ఫ్రంట్‌లో 400 మీటర్ల సరిహద్దులో వాటర్ ఫ్రంట్ ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని  మెట్రోపాలిటన్ ప్రీమియం ప్రాపర్టీస్ సీఈఓ నికితా కుజ్నెత్సోవ్ తెలిపారు. తాజా కొనుగోలు ఒప్పందం అధిక నాణ్యత గల దుబాయ్ గృహాలకు పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనమని తెలిపారు. వాటర్‌ఫ్రంట్ ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని, కాగా యూనిట్లు పరిమితంగా మాత్రమే అందుబాటులో ఉన్నాయని కుజ్నెత్సోవ్ చెప్పారు. తిలాల్ అల్ ఘఫ్ ఉన్న లానాయ్ ద్వీపం.. ప్రైవేట్ ద్వీపాలలో ఒకటి. ఇందులో 13 విలాసవంతమైన భవనాలు ఉన్నాయి.  వీటిలో తొమ్మిది 'తీర భవనాలు' కాగా.. నాలుగు ఎడ్జ్ మాన్షన్‌లున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com