దుబాయ్ లో 2023 స్కూల్ అడ్మిషన్లు: పేరెంట్స్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నిబంధనలు

- February 11, 2023 , by Maagulf
దుబాయ్ లో 2023 స్కూల్ అడ్మిషన్లు: పేరెంట్స్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నిబంధనలు

దుబాయ్‌: దుబాయ్‌లోని తల్లిదండ్రులు వచ్చే విద్యా సంవత్సరానికి తమ పిల్లలను ఎన్‌రోల్ చేయడానికి సంబంధించి  నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) తల్లిదండ్రుల సౌలభ్యం కోసం అప్లికేషన్ ఫీజులు, రిజిస్ట్రేషన్, డిపాజిట్ల గురించి నిబంధనలను వెల్లడించింది. KHDA వెబ్‌సైట్ ప్రకారం.. కొత్త విద్యార్థుల దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి పాఠశాలలు Dh500 వరకు వసూలు చేయవచ్చు. పాఠశాలలు కొత్త ఎన్‌రోల్‌మెంట్‌ను నిర్ధారించడానికి నాన్-రీఫండబుల్ డిపాజిట్ చెల్లించమని తల్లిదండ్రులను అడగవచ్చు. రిజిస్ట్రేషన్ డిపాజిట్ మొత్తం ట్యూషన్ ఫీజులో 10 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు.  పాఠశాలలు వారి పిల్లలకు తదుపరి విద్యా సంవత్సరానికి సంబంధించి రీ-రిజిస్ట్రేషన్ డిపాజిట్‌ని చెల్లించమని తల్లిదండ్రులను అడగవచ్చు. డిపాజిట్ మొత్తం ట్యూషన్ ఫీజులో ఐదు శాతం కంటే ఎక్కువ ఉండకూడదు లేదా Dh500 (ఏది ఎక్కువైతే అది) విద్యా సంవత్సరానికి సంబంధించిన మొత్తం ట్యూషన్ ఫీజు నుండి మినహాయించబడుతుందని అథారిటీ స్పష్టం చేసింది.

రీ-రిజిస్ట్రేషన్ డిపాజిట్ మొదటి టర్మ్ ఫీజు నుండి మినహాయించబడుతుంది. రీ-రిజిస్ట్రేష‌న్ కాకుండా మరేదైనా అదనపు రుసుములు లేదా డిపాజిట్‌లను చెల్లించమని పాఠశాల కోరవద్దు. సెప్టెంబర్‌లో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించే పాఠశాలలు వసంత విరామం ముగిసిన తర్వాత మాత్రమే తిరిగి నమోదు డిపాజిట్‌ను సేకరించాలి. ఏప్రిల్‌లో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించే పాఠశాలలు శీతాకాల విరామం ముగిసిన తర్వాత మాత్రమే రీ-రిజిస్ట్రేషన్ డిపాజిట్‌ను సేకరించాలని నిబంధనల్లో తెలిపారు.

విద్యార్థు పేర్ల నమోదు

పాఠశాలలు విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా కొత్త విద్యార్థులను నమోదు చేసుకోవచ్చని KHDA పేర్కొంది. విద్యార్థులను నమోదు చేసుకునే ముందు కొత్త పాఠశాలలు తప్పనిసరిగా KHDA అనుమతిని కలిగి ఉండాలి. విద్యా సంవత్సరంలో కొత్త విద్యార్థులు పాఠశాలలో చేరినట్లయితే, పాఠశాల నమోదు చేసిన నెల నుండి ట్యూషన్ ఫీజులను వసూలు చేయవచ్చు. (ఉదాహరణకు, అక్టోబర్ మూడవ వారంలో ఒక విద్యార్థి కొత్త పాఠశాలలో చేరినట్లయితే, పాఠశాల ట్యూషన్ ఫీజును అక్టోబర్ ప్రారంభం నుండి వసూలు చేయవచ్చు) ఎన్‌రోల్‌మెంట్ చివరి ఆఫర్ చేసే వరకు పాఠశాలలు రిజిస్ట్రేషన్ డిపాజిట్ చెల్లింపు కోసం అడగకూడదు. దీనికి ముందు పాఠశాలలు గరిష్టంగా Dh500 దరఖాస్తు రుసుమును మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. పాఠశాల విద్యార్థికి అడ్మిషన్ కల్పించని సందర్భంలో Dh500 దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించాలి.  

ట్యూషన్ ఫీజు చెల్లింపులు

పాఠశాలలు వార్షిక ట్యూషన్ ఫీజులను మూడు విడతల్లో మాత్రమే వసూలు చేయాలి. ప్రతి టర్మ్ ప్రారంభంలో చెల్లించాల్సి ఉంటుంది. మొదటి టర్మ్ చెల్లింపు వార్షిక ట్యూషన్ ఫీజులో 40 శాతానికి మించకూడదు. రెండవ చెల్లింపు వార్షిక ట్యూషన్ ఫీజులో 30 శాతానికి మించకూడదు.  మూడవ టర్మ్ వార్షిక ట్యూషన్ ఫీజులో 30 శాతానికి మించకూడదు. KHDA ప్రకారం.. పాఠశాలలు 10 సమానమైన నెలవారీ వాయిదాలలో వార్షిక ట్యూషన్ ఫీజులను చెల్లించేల విద్యార్థుల పేరెంట్స్ కు అవకాశం కల్పించాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com