అబుధాబి, దుబాయ్, షార్జాలో సిద్ధమైన 16,000 రిలీఫ్ బాక్స్‌లు

- February 12, 2023 , by Maagulf
అబుధాబి, దుబాయ్, షార్జాలో సిద్ధమైన 16,000 రిలీఫ్ బాక్స్‌లు

యూఏఈ: కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖతో పాటు దేశంలోని ఛారిటీ ఫౌండేషన్‌ల సమన్వయంతో ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ (ERC) నిర్వహించే “బ్రిడ్జెస్ ఆఫ్ గివింగ్” ప్రచారం శనివారం ప్రారంభమైంది. సిరియా, టర్కీలో భూకంపం వల్ల ప్రభావితమైన వారికి ఉద్దేశించిన అత్యవసర సహాయాన్ని సిద్ధం చేయడానికి, ప్యాకేజీ సిద్ధం అవుతుంది. అబుధాబి, దుబాయ్, షార్జాలలో ఎయిడ్ బాక్సుల తయారీ, ప్యాకేజింగ్ కోసం ఏర్పాటు చేయబడిన కేంద్రాలలో  స్వచ్ఛంద సేవకులు, వివిధ దేశాలకు చెందిన సొసైటీ సభ్యులు, ప్రజలు, నివాసితులు స్వచ్ఛందంగా ప్యాకేజింగ్ చేయడంలో పాలు పంచుకుంటున్నారు.

అబుధాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (ADNEC)లో, ERC చైర్మన్ డాక్టర్ హమ్దాన్ ముసల్లం అల్ మజ్రూయి, యూఏఈలోని సిరియా రాయబారి డాక్టర్ ఘసన్ అబ్బాస్, యూఏఈలోని టర్కీ రాయబారి తుగే టున్సర్ సహాయం చేసేందుకు వాలంటీర్లు తరలిరావాలని అంతకుముందు పిలుపునిచ్చారు. డాక్టర్ హమ్దాన్ అల్ మజ్రోయి మాట్లాడుతూ.. వాలంటీర్లు పని ప్రారంభించిన కొద్ది గంటల్లో, మూడు రకాల సహాయ పెట్టెలను సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు స్వచ్ఛంద బృందాలు 16,000 సహాయ పెట్టెలను సిద్ధం చేశాయి. అబుధాబిలో 7,000, దుబాయ్‌లో 6,000, షార్జాలో 3,000 బాక్సులు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. అబుధాబిలోని ERC సెంటర్ డైరెక్టర్ సేలం అల్ సువైదీ మాట్లాడుతూ.. వాలంటీర్ల సంఖ్య ఇప్పటివరకు 2,000 మందికి చేరుకుందని, మొదటి గంటలోనే  సిరియా, టర్కీకి అత్యవసరంగా పంపడానికి ఉద్దేశించిన 16,000 పెట్టెల్లో ప్యాకేజింగ్, అత్యవసర పదార్థాలను సిద్ధం చేశారన్నారు. తాము అబుదాబిలో 9, అల్ ఐన్‌లో 2 సహా అబుధాబి ఎమిరేట్‌లో విరాళాలు స్వీకరించడానికి 11 కారవాన్‌లను ఏర్పాటు చేసినట్లు అల్ సువైదీ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com