బహ్రెయిన్‌లో యువతలో గుండెపోటులు పెరుగుతున్నాయా?
- February 12, 2023
బహ్రెయిన్: గుండెపోటు అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయపెడుతుంది. 40 ఏళ్లలోపు వారిలో గుండెపోటు రావడం ఒకప్పుడు అరుదైనగా భావిస్తుండే వారు. కానీ ఈ రోజుల్లో ఇది సాధరణ సమస్యగా మారుతుంది. చిన్న వయసు వారిలోనూ గుండెపోటు కనిపిస్తుందని కార్డియాలజిస్టులు పేర్కొన్నారు. 40 లేదా 20 ఏళ్లలో గుండెపోటు రావడం చాలా సాధారణంగా కనిపిస్తుందన్నారు. బహ్రెయిన్ వైద్య నివేదిక ప్రకారం.. ప్రతి ఐదు గుండెపోటులలో ఒకటి 40 ఏళ్లలోపు రోగులలో వస్తుంది. బహ్రెయిన్‌లో మొత్తం మరణాలలో 28% కార్డియోవాస్కులర్ అనారోగ్యం కారణంగా సంభవించినట్లు ఇటీవలి పరిశోధనలో పేర్కొన్నారు. జీవనశైలి, అంతర్గత జన్యు సిద్ధత, అధిక ధూమపానం, మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ మరియు ఊబకాయం వంటివి గుండెపోటులకు ప్రధాన సమస్యలుగా కార్డియాలజిస్ట్ డాక్టర్ అబ్దుల్ అజీజ్ మహమ్మద్ చెప్పారు.
గుండెపోటు నివారణ మార్గాలు
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వారానికి ఐదు రోజులు వ్యాయామం చేయడం చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువుతో ఉన్నవారు BMIని 25 లోపు నిర్వహించాలి. అందుకు బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. 130/80 mm Hg కంటే తక్కువ రక్తపోటు మెయింటన్ చేయాలి. చక్కెర స్థాయిలను నిర్వహించడం పర్యవేక్షణ అవసరం. మధుమేహం ఉంటే మీ HBA1Cని 6.5 వద్ద లేదా అంతకంటే తక్కువ స్థాయిలో మెయింటన్ చేయాలి. ECG, ECHO, ట్రెడ్మిల్ పరీక్ష లేదా డ్రగ్స్‌తో పాటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రమాద కారకాలు ఉంటే మీరు వార్షిక గుండె పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ మహమ్మద్ తెలిపారు.
ప్రతి ఐదుగురులో ఒకరు 40 ఏళ్లలోపువారే
బహ్రెయిన్ లో ప్రతి ఐదుగురు గుండెపోటు రోగులలో ఒకరు 40 ఏళ్లలోపు ఉన్నారని కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రంజిత్ మీనన్ తెలిపారు. డాక్టర్ మీనన్ గుండెపోటును నివారించడానికి ఆస్పిరిన్ ఉపయోగించకూడదని సూచించారు. గుండెపోటును అనుభవించిన లేదా తమకు కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉందని చెప్పబడిన రోగులు తక్కువ మోతాదులో ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందుతారని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







