విజయ్‌కి కలిసి రాలేదు.! ధనుష్ ఏం చేస్తాడో.!
- February 13, 2023ఈ మధ్య తమిళ హీరోలు తెలుగు డైరెక్టర్స్ మీదా, తెలుగు మార్కెట్ మీదా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే సంక్రాంతి సందర్భంగా తమిళ స్టార్ హీరో విజయ్ ‘వారసుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.స్ట్రెయిట్ మూవీగానే ఈ సినిమాని రిలీజ్ చేశారు. కానీ, విజయ్‌కి తెలుగులో పెద్దగా వర్కవుట్ కాలేదు.
ఇప్పుడు మరో తమిళ హీరో ధనుష్ వస్తున్నాడు. ‘సార్’ అనే సినిమా కోసం, తెలుగు హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో ధనుష్ పని చేశాడు. వచ్చే శుక్రవారం అంటే ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా విద్యా వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపుతూ, సందేశాత్మకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. బజ్‌తో సంబంధం లేకుండా, సినిమా కంటెంట్ నచ్చితే, తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు చూడాలి మరి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..