నయన తార, మాళవికా మోహనన్ మధ్య ఆ కోల్డ్ వార్ ఏంటబ్బా.!

- February 13, 2023 , by Maagulf
నయన తార, మాళవికా మోహనన్ మధ్య ఆ కోల్డ్ వార్ ఏంటబ్బా.!

‘మాస్టర్’ ‘మారన్’ తదితర సినిమాలతో హీరోయిన్‌గా క్రేజ్ దక్కించుకున్న మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్. చేసిన సినిమాలు తక్కువే అయినా ఈ ముద్దుగుమ్మ యూత్‌తో బాగా క్రేజ్ సంపాదించింది. అంతేకాదు, తక్కువ సినిమాలే అయినా అన్నీ హిట్ సినిమాలే కావడం కూడా అమ్మడికి ఓ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.
అనతి కాలంలోనే తెలుగులో ప్రబాస్ సినిమాలో నటించే ఛాన్స్ కూడా కొట్టేసిందీ బ్యూటీ. అయితే, మొన్నా మధ్య నయన తారపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కింది. హాస్పిటల్ సీన్‌లో కూడా మేకప్ వేసుకుంది ఓ హీరోయిన్.. అంటూ నయనతారను ఇన్‌డైరెక్ట్‌గా కెలికింది ఈ ముద్దుగుమ్మ. అందుకు నయన్ సంజాయిషీ ఇచ్చుకుందనుకోండి. అది వేరే సంగతి.
తాజాగా మళ్లీ కెలుక్కుంది మాళవికా. నయన్‌ని లేడీ సూపర్ స్టార్ అనడం తనకు నచ్చలేదని వ్యాఖ్యానించింది. దాంతో, మళ్లీ ఈ చిచ్చు మొదటికొచ్చింది. అసలెందుకు నయన్ అంటే మాళవికకు అంత ఒళ్లు మంట అని చెవులు కొరుక్కుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com