తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్రం ప్రకటన
- February 13, 2023
న్యూఢిల్లీ; కేంద్రం పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర అప్పులపై ప్రకటన చేసింది. 2022 అక్టోబరు నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ.4,33,817.6 కోట్లు అని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ప్రభుత్వ అప్పులే కాకుండా… రాష్ట్ర సర్కారు పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులను కూడా ఇందులో చేర్చారు.
ఇక, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి ప్రభుత్వపరంగా రూ.75,577 కోట్ల అప్పులు ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. 2021-22 నాటికి ఆ అప్పుల విలువ రూ.2,83,452 కోట్లు అని తెలిపింది. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.2,07,881 కోట్ల అప్పులు చేసినట్టు తెలిపింది.
కాగా, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







