కియారా‌కి #RC15 నుంచి స్పెషల్ మ్యారేజ్ విషెస్.!

- February 13, 2023 , by Maagulf
కియారా‌కి #RC15 నుంచి స్పెషల్ మ్యారేజ్ విషెస్.!

ఈ నెల 7న రాజస్థాన్‌లో అంగ రంగ వైభవంగా వివాహం చేసుకుంది అందాల భామ కియారా అద్వానీ. బాలీవుడ్ హ్యాండ్‌సమ్ సిద్దార్ధ్ మల్హోత్రాతో కియారా అద్వానీ వివాహం జరిగింది. కాగా, ప్రస్తుతం కియారా అద్వానీ, రామ్ చరణ్ 15 వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 
ఈ సినిమా టీమ్, కియారా అద్వానీకి స్పెషల్‌గా విషెస్ తెలిపారు. హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్‌తో సహా టీమ్ అంతా ఘనంగా విషెస్ తెలిపారు కియారా జంటకి. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. 
ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ఈ సినిమా సెట్స్‌లోకి త్వరలో కియారా అద్వానీ అడుగు పెట్టనుంది. అలాగే అంజలి, సునీల్, ఎస్.జె.సూర్య, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com