నయన తార, మాళవికా మోహనన్ మధ్య ఆ కోల్డ్ వార్ ఏంటబ్బా.!
- February 13, 2023
‘మాస్టర్’ ‘మారన్’ తదితర సినిమాలతో హీరోయిన్గా క్రేజ్ దక్కించుకున్న మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్. చేసిన సినిమాలు తక్కువే అయినా ఈ ముద్దుగుమ్మ యూత్‌తో బాగా క్రేజ్ సంపాదించింది. అంతేకాదు, తక్కువ సినిమాలే అయినా అన్నీ హిట్ సినిమాలే కావడం కూడా అమ్మడికి ఓ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.
అనతి కాలంలోనే తెలుగులో ప్రబాస్ సినిమాలో నటించే ఛాన్స్ కూడా కొట్టేసిందీ బ్యూటీ. అయితే, మొన్నా మధ్య నయన తారపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కింది. హాస్పిటల్ సీన్లో కూడా మేకప్ వేసుకుంది ఓ హీరోయిన్.. అంటూ నయనతారను ఇన్‌డైరెక్ట్‌గా కెలికింది ఈ ముద్దుగుమ్మ. అందుకు నయన్ సంజాయిషీ ఇచ్చుకుందనుకోండి. అది వేరే సంగతి.
తాజాగా మళ్లీ కెలుక్కుంది మాళవికా. నయన్‌ని లేడీ సూపర్ స్టార్ అనడం తనకు నచ్చలేదని వ్యాఖ్యానించింది. దాంతో, మళ్లీ ఈ చిచ్చు మొదటికొచ్చింది. అసలెందుకు నయన్ అంటే మాళవికకు అంత ఒళ్లు మంట అని చెవులు కొరుక్కుంటున్నారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







