పాఠశాలల్లో 9 రోజులపాటు మిడ్ టెర్మ్ సెలవులు!
- February 14, 2023
యూఏఈ: కొన్ని పాఠశాలలు ఫిబ్రవరి 13 నుండి 17 వరకు మిడ్ టెర్మ్ సెలవులు ప్రకటించాయి. కాగా మరికొన్ని పాఠశాలలు మాత్రం ఫిబ్రవరి 13,14 తేదీల్లో మాత్రమే మూసివేయనున్నట్లు వెల్లడించాయి. కొన్ని పాఠశాలలు ఫిబ్రవరి 16 నుండి మిడ్ టర్మ్ విరామం ప్రారంభమవుతుందని తెలిపాయి. వారాంతం ఫిబ్రవరి 11, 12, అలాగే ఫిబ్రవరి 18, 19 తేదీలలో వస్తుంది కాబట్టి సెలవులు వరుసగా తొమ్మిది రోజులుపాటు నాలుగు రోజుల వ్యవధిలో ఉండనున్నాయి. మెజారిటీ పాఠశాలలకు ఫిబ్రవరి 20న(సోమవారం) తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. బ్రిటీష్, IB పాఠ్యప్రణాళిక పాఠశాలలు మిడ్ టర్మ్ విరామం కలిగి ఉండగా, చాలా అమెరికన్ పాఠ్యాంశ పాఠశాలలకు ఈ విరామం ఉండదు. అలాగే భారతీయ పాఠ్యప్రణాళిక పాఠశాలలు కూడా సంవత్సరంలో ఈ సమయంలో విరామ సెలవులు ఇవ్వవు.. అవి మార్చిలో వేసవి సెలవులను ప్రకటిస్తాయి.
ఈ విద్యా సంవత్సరంలో ఇతర సెలవులు
యూఏఈలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెండవ, మూడవ టర్మ్‌లలో మూడు సెలవులు ఉంటాయి. వసంత విరామం రెండు వారాల పాటు కొనసాగుతుంది. అంతర్జాతీయ పాఠ్యాంశ పాఠశాలల కోసం, వేసవి సెలవులు మార్చి 27 నుండి ఏప్రిల్ 7 వరకు ఉంటాయి. సంవత్సరంలో పాఠశాలు నడిచే రోజులు తప్పనిసరిగా కనీసం 182 కు తక్కువగా కాకుండా ఉండాలి. యూఏఈ కేబినెట్ ఆమోదించిన అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం.. ఈద్ అల్ ఫితర్ తేదీలు రంజాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు ఉంటాయి. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం, ఇది ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 23 వరకు ఉంటుంది. ఈద్ అల్ అదా సెలవుదినం (అరాఫా డే, ఈద్ అల్ అధా) జూన్ 27 నుండి జూన్ 30 వరకు ఉంటుంది. యూఏఈలోని అన్ని పాఠశాలలకు వారు బోధించే పాఠ్యాంశాలతో సంబంధం లేకుండా వేసవి విరామం తప్పనిసరిగా 8.2 వారాల కంటే ఎక్కువ ఉండకూడదు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







