అంబేద్కర్ జయంతి రోజే తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం

- February 14, 2023 , by Maagulf
అంబేద్కర్ జయంతి రోజే తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభ తేదీని ఫిక్స్ చేసారు. ముందుగా కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ఈ నెల 17న సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. తాజాగా, ప్రభుత్వం మరో ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇక సచివాలయం ప్రారంభానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, జేడీయూ నేత అలన్‌సింగ్, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌లను ప్రభుత్వం ఆహ్వానించారు. కాగా, ముందు ప్రణాళిక ప్రకారం సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ముహూర్తం మారిన నేపథ్యంలో ఈ సభ ఉంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com