విమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది..
- February 14, 2023
విమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం నిన్న ముంబైలో ముగిసిన నేపథ్యంలో బీసీసీఐ డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ ను ప్రకటించింది. మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. మొదటి మ్యాచు గుజరాత్ జెయింట్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. డబ్ల్యూపీఎల్ లో ఐదు జట్లు ఆడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్లు తలపడతాయి.
డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ లో మొత్తం 20 లీగ్ మ్యాచులు.. 2 ప్లే ఆఫ్ మ్యాచులు.. 23 రోజుల పాటు జరుగుతాయి. మార్చి 4న తొలి మ్యాచు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. మార్చి 5న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బ్రబౌర్న్ స్టేడియంలో మ్యాచు జరుగుతుంది.
అలాగే, డీవై పాటిల్ స్టేడియంలో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మరో మ్యాచు జరుగుతుంది. కాగా, డీవై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియంలో మొత్తం 11 మ్యాచుల చొప్పున జరగనున్నాయి. మార్చి 24న డీవై పాటిల్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచు మార్చి 26న ఉంటుంది. మార్చి 4న ప్రారంభమయ్యే మ్యాచులు మార్చి 26తో ముగుస్తాయి. వేలం పాటలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి.

తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







