తమన్నా ఎగ్జయిట్మెంట్ ఈ సారైనా తీరేనా.?
- February 16, 2023మిల్కీబ్యూటీ తమన్నా మంచి నటి అని తెలిసిందే. అలాగే మంచి డాన్సర్ కూడా. డాన్స్ కా బాప్ అయిన మెగాస్టార్‌తో కలిసి డాన్స్ చేయాలన్న తమన్నా కోరిక ఇంతవరకూ తీరలేదు.
‘సైరా నరసింహారెడ్డి’లో తమన్నా నటించింది కానీ, మెగాస్టార్‌తో కలిసి కెమిస్ర్టీ పండిస్తూ స్టెప్పులేసే ఛాన్స్ జస్ట్‌లో మిస్ చేసుకుంది. ఇక, ఇప్పుడు ‘భోళా శంకర్’ సినిమా కోసం మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో జత కడుతోంది తమన్నా.
సిస్టర్ సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనైనా తమన్నాకి, చిరంజీవితో కలిసి డాన్స్ చేసే ఛాన్స్ దక్కుతుందా.? అంటే ఖచ్చితంగా తీరుతుందంటున్నారు.
తమన్నా, చిరంజీవిపై ఓ మాస్ సాంగ్, క్లాస్ రొమాంటిక్ సాంగ్స్ వున్నాయనీ, ఈ రెండు పాటల్లోనూ చిరంజీవితో డాన్స్ ఇరగదీసేసిందనీ తెలుస్తోంది. అందుకే ఈ సినిమా కోసం తమన్నా చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తోందట. సమ్మర్ స్పెషల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- భారత్‌కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్