సిగ్నల్ జంప్ చేస్తే మాడు పగిలే జరిమానా
- February 16, 2023
అబుధాబి: అబుధాబిలో రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ విభాగం కఠిన నిర్ణయం తీసుకుంది.ట్రాఫిక్ చలాన్లను భారీగా పెంచింది. దీనిలో భాగంగా రెడ్ సిగ్నల్ క్రాస్ చేసిన వారికి 51,000 దిర్హాములు వరకు జరిమానా విధిస్తుంది.ఇందులో వెయ్యి దిర్హాములు సిగ్నల్ జంపింగ్‌కు, మరో 50,000 దిర్హాములు జప్తు చేసిన వాహనాన్ని తిరిగి వాహనదారుడు పొందడానికి చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ నేరాలకు సంబంధించి 2020 నాటి చట్టం నం.05 ప్రకారం రెడ్‌లైట్ సిగ్నల్‌ను జంప్ చేసినందుకు వాహనదారుడికి 1,000 దిర్హాములు జరిమానాతో పాటు12 బ్లాక్ పాయింట్లు వేయడం జరుగుతుంది.అలాగే వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తారు.
దీనికి అదనంగా వాహనం 30 రోజుల పాటు జప్తు చేయబడుతుంది.ట్రాఫిక్ విభాగం స్వాధీనం చేసుకున్న వాహనాన్ని విడుదల చేయడానికి 50వేల దిర్హాములు చెల్లించాలి.ఇక స్వాధీనం చేసుకున్న వాహనాన్ని వాహనదారుడు మూడు నెలల్లోగా విడిపించుకోకపోతే వేలం వేస్తారు.ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అబుదాబి ట్రాఫిక్ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ కొత్త విధానంలో 2021 ఏడాదికి సంబంధించి రెడ్ సిగ్నల్ జంప్ చేసినందుకుగాను మొత్తం 2,850 వాహనదారులకు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు తాజాగా గత ఏడాది జరిగిన కొన్ని భయంకరమైన రోడ్డు ప్రమాదాల తాలూకు సీసీటీవీ ఫొటోలను సైతం అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు.ఇక పై ఇలాంటివి జరగకుండా ఉండేందుకు తాము ఇలా కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలను కూడా వెల్లడించారు. ఈ క్రింద వివరాలు మీకోసం...
- లెఫ్ట్ లేన్‌లో వాహనాలకు దారి ఇవ్వకపోతే 400 దిర్హాములు జరిమానా
- డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై చెత్త వేస్తే వెయ్యి దిర్హాములు, 6బ్లాక్ పాయింట్లు
- రోడ్డు పై అడ్డదిడ్డంగా నడిస్తే 400 దిర్హాములు
- వాహనం నడుపుతున్న సమయంలో ఫోన్ మాట్లాడితే 800 దిర్హాములు జరిమానా, 4బ్లాక్ పాయింట్లు
- రోడ్డు పై ఆకస్మిక ఆగిపోవడం చేస్తే 1,000 దిర్హాములు, 6బ్లాక్ పాయింట్లు
- ప్రమాదకరమైన రీతిలో వాహనాన్ని రివర్స్ తీసుకోవడం చేస్తే 500 దిర్హాములు, 4బ్లాక్ పాయింట్లు
- యూటర్న్ లేని చోట యూటర్న్ తీసుకుంటే 500 దిర్హాములు ఫైన్, 4బ్లాక్ పాయింట్లు
- రాత్రివేళ వాహనానికి లైట్ లేకుండా డ్రైవ్ చేస్తే 500 దిర్హాములు జరిమానా, 4బ్లాక్ పాయింట్లు
- ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే 500 దిర్హాములు ఫైన్, 4బ్లాక్ పాయింట్లు, 7 రోజులపాటు వాహనం జప్తు
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







