ఢిల్లీ, ముంబై ఆఫీసుల్ని మూసేసిన ట్విట్టర్..
- February 17, 2023
భారతదేశంలోని మూడు కార్యాలయాల్లో రెండింటిని ట్విట్టర్ మూసివేసింది. ఈ రెండు కార్యాలయాల్లో ఉన్న సిబ్బందికి ఇంటి నుండి పని చేయమని ఆదేశాలు జారీ చేసింది. ఖర్చులను తగ్గించుకుంటూ సోషల్ మీడియా సేవల్ని అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ పేర్కొంది. గత ఏడాది చివర్లో భారతదేశంలోని దాదాపు 200 మందికి పైగా సిబ్బందిలో 90 శాతం మందిని తొలగించిన ట్విట్టర్, రాజకీయ కేంద్రం న్యూఢిల్లీ, ఆర్థిక కేంద్రమైన ముంబైలోని తన కార్యాలయాలను మూసివేసినట్లు ప్రకటించడం గమనార్హం.
ఇక ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులోని దక్షిణ టెక్ హబ్‌లో ఎక్కువ మంది ఇంజనీర్లు ఉన్న కార్యాలయాన్ని మాత్రమే ట్విట్టర్ కొనసాగిస్తోంది. కొద్ది రోజుల క్రితమే ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. 2023 చివరి నాటికి ట్విట్టర్‌ను ఆర్థికంగా స్థిరీకరించే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగుల తొలగింపు, కార్యాలయాల మూసివేత వంటివి పెద్ద ఎత్తున చేపట్టారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సిబ్బందిని తొలగించారు. అలాగే చాలా దేశాల్లో కార్యాలయాలను మూసివేశారు.
ఇండియా ఇంటర్నెట్ రంగంలో ఇప్పటికీ మెటా, గూగుల్ వంటి సంస్థలే ముందంజలో ఉన్నాయి. కొద్ది కాలం క్రితం నుంచే భారత జనస్వామ్యంలో ప్రభావవంతమైన పబ్లిక్ ఫ్లాట్ ఫాంలలో ఒకటిగా ట్విట్టర్ ఆదరణ పొందింది. పైగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతాకు 86.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ ట్విట్టర్‌కు తగినంత ఆదాయం లేనట్లు సమాచారం. అయినప్పటికీ పోటీలో నిలదొక్కుకుని నిలబడడానికి బదులు ఇండియాలో ఇంటర్నెట్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇలాంటి తరుణంలో ట్విట్టర్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చని అంటున్నారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







