ఘోర బస్సు ప్రమాదం: నలుగురు మృతి, పలువురికి గాయాలు

- February 18, 2023 , by Maagulf
ఘోర బస్సు ప్రమాదం: నలుగురు మృతి, పలువురికి గాయాలు

మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 53 మంది ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. 53 మందితో వెళ్తున్న బస్సు అల్-బస్తాన్-వాడి అల్-కబీర్ రోడ్‌కు వెళ్లే క్వాంటాబ్ అకాబా నుండి వెళ్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే నలుగురు ప్రయాణికులు మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.మిగతా ప్రయాణికుల్లో ఏడుగురికి మోస్తరు గాయాలు కాగా..38 మందికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com