నివాస భవనంలో అగ్ని ప్రమాదం.. 11 మందికి అస్వస్థత
- February 18, 2023
యూఏఈ: అజ్మాన్‌లోని నివాస భవనంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్, పోలీస్ విభాగాలు మంటలను అదుపు చేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎమిరేట్‌లోని అల్ రషీదియా ప్రాంతంలోని పెరల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ టవర్లలో ఒకదానిలో అగ్ని ప్రమాదం జరిగింది. అజ్మాన్ పోలీస్ కమాండర్ జనరల్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నుయిమి పర్యవేక్షణలో మంటలను అదుపు చేశారు. పోలీసులు, పౌర రక్షణ దళాలు టవర్‌ను ఖాళీ చేయించారు. ప్రమాద స్థలంలో శీతలీకరణ కార్యకలాపాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మంటలు అనేక అపార్ట్మెంట్లకు చేరాయని, పొగ కారణంగా తొమ్మిది మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని, ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అంబులెన్స్ బృందాలు సంఘటనా స్థలంలో తొమ్మిది మందికి చికిత్స అందించాయని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







