చిరు ట్వీట్: చరణ్ సాధించిన ఘనత ఆస్కార్ కంటే ఎక్కువే.!
- February 18, 2023మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్యాన్ ఇండియా.. కాదు కాదు, ప్యాన్ వరల్డ్ గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. ‘అవతార్’ తదితర చిత్రాలతో ప్రపంచం గర్వించదగ్గ ఫిలిం మేకర్ అయిన జేమ్స్ కెమెరూన్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గురించి ఇటీవల ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం జరిగింది.
Sir @JimCameron an acknowledgement of his character in #RRR from a Global Icon & Cinematic Genius like you is no less than an Oscar itself! It’s a great honor for @AlwaysRamCharan As a father I feel proud of how far he’s come. Ur compliment is a blessing for his future endeavours pic.twitter.com/jof3Q9j0pA
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 17, 2023
ఆ ట్వీట్‌కి ఎమోషనల్ అయిన మెగాస్టార్ చిరంజీవి, జేమ్స్ కెమెరూన్ ప్రశంసించడం అంటే అంత ఆషామాషీ కాదు. ఇది ఆస్కార్ కన్నా గొప్ప ప్రశంస.. అని తాజాగా ట్వీట్ చేశారు. పుత్రోత్సాహం అలా వుంటుంది మరి. అయితే, ఈ చిరంజీవి ట్వీట్‌ని తప్పు పడుతూ కొందరు సోషల్ ఆకతాయిలు విమర్శలు చేస్తున్నారు.
అవును నిజమే, ‘ఆర్ఆర్ఆర్’ క్రెడిట్ అంటే.. కేవలం రామ్ చరణ్‌ది మాత్రమే కాదు. ఎన్టీయార్, రాజమౌళి, కీరవాణి.. ఇలా చాలా మంది పేర్లు ప్రస్థావించాల్సి వుంటుంది. అయితే, సగటు తండ్రిగా తన పుత్రుని గొప్పతనానికి ఉప్పొంగిపోతూ, తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా చిరంజీవి పంచుకోవడంలో తప్పేముందో ఆ విమర్శలు చేసిన వారికే ఎరుక.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?