వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసిన ప్రబాస్.! టార్గెట్ రీచ్ అవుతాడా.?
- February 18, 2023
యూనివర్సల్ స్టార్ అయిన ప్రబాస్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదో సంచలనమే. అయితే, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది ప్రభాస్ పరిస్థితి. అనౌన్స్మెంట్ అయిన ప్రాజెక్టులే అనుకున్న టైమ్‌కి రిలీజ్ కాకుండా పోతున్నాయ్. ఈ ఏడాది సంక్రాంతికి ‘ఆది పురుష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, అనుకోని కారణాలతో ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమా కోసం టైమ్ లాక్ చేశారు.
2024 సంక్రాంతికి ‘ప్రాజెక్ట్ కె’ సినిమాని రిలీజ్ చేయబోతున్నామంటూ తాజాగా అనౌన్స్మెంట్ రిలీజ్ చేశారు మేకర్లు. దాంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నిండింది. కానీ, ఈ ఉత్సాహం ఉరకలెత్తుతుందో లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇంత తొందరగా రిలీజ్ టైమ్ లాక్ చేసుకుంటే ఆ టైమ్‌కి పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేని పరిస్థితి. అసలే ఈ ఏడాది సైతం చాలా పెద్ద సినిమాలు రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయ్. చూడాలి మరి.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







