ఒక్క రోజులో $3.7 మిలియన్లు సేకరణ
- February 18, 2023
బహ్రెయిన్: సిరియా, టర్కీని వణికించిన భూకంపం బాధితుల కోసం తక్షణ మానవతా సహాయం కోసం బహ్రెయిన్ తన జాతీయ ప్రచారం కింద $3.7 మిలియన్ (BD1.38 మిలియన్) కంటే ఎక్కువ సేకరించినట్లు రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (RHF) ప్రకటించింది. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాల మేరకు బహ్రెయిన్ టీవీ RHF సహకారంతో "సాలిడారిటీ డే"ని నిర్వహించింది. హిస్ మెజెస్టి కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ ప్రతినిధి హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయ పిలుపు మేరకు బహ్రెయిన్‌లు, నివాసితులు, జాతీయ సంస్థలు,కంపెనీలు, బ్యాంకులు, సొసైటీలు, ఇతర సామాజిక భాగాలు బహ్రెయిన్ TVలో ప్రసారమైన విరాళ టెలిథాన్‌కు విశేషంగా స్పందించారు. ఈ సందర్భంగా విరాళాలు అందజేసిన వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. భూకంప బాధితుల కోసం క్యాంపెయి ఇంకా కొనసాగుతోందని, ఆర్‌హెచ్‌ఎఫ్ ఛానెల్‌ల ద్వారా విరాళాలు అందజేయవచ్చిన ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







