మూడు రోజులు 33ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులు రద్దు..
- February 20, 2023
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. నగరంలో మూడు రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులు అందుబాటులో ఉండవని పేర్కొంది. కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా సోమవారం నుంచి బుధవారం వరకు 33 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సి.హెచ్. రాకేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
లింగంపల్లి – హైదరాబాద్, ఫలక్నుమా – లింగంపల్లి, సికింద్రాబాద్ – లింగంపల్లి, రామచంద్రాపురం -ఫలక్నుమా, ఫలక్నుమా – హైదరాబాద్ మధ్య తిరిగే సర్వీస్సులను మూడు రోజులు పాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్యరైల్వే తెలిపింది. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించి ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. ప్రతీరోజూ ఎంఎంటీఎస్ రైళ్లలో వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. కార్మికులతో పాటు రోజువారీ కూలీల నుంచి ఉద్యోగుల వరకు తమతమ పని ప్రదేశాలకు చేరుకోవాలంటే ఎంఎంటీఎస్ రైళ్లలోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అయితే, శని, ఆదివారాల్లో సెలవు దినాలు కావటం సోమవారం వర్కింగ్ డే కావటంతో ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే ప్రయాణీకులు ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసుల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
– లింగంపల్లి – హైదరాబాద్ రూట్లలో పయణించే ఆరు సర్వీస్సులు ( 47129, 47133, 47135, 47137, 47138, 47140 ) తాత్కాలికంగా రద్దయ్యాయి.
– హైదరాబాద్ టూ లింగంపల్లి రూట్లో ఏడు ఎంఎంటీఎస్ సర్వీసులు ( 47105, 47110, 47111, 47114, 47116, 47119, 47120) తాత్కాలికంగా రద్దయ్యాయి.
– ఫలక్నుమా నుంచి లింగంపల్లి వెళ్లే ఏడు ఎంఎంటీఎస్ సర్వీసులు (47165, 47160, 47156, 47158, 47214, 47203, 47216) తాత్కాలికంగా రద్దయ్యాయి.
– లింగంపల్లి నుంచి ఫలక్నుమా రూట్లో ఎనిమిది ఎంఎంటీఎస్ సర్వీసులు ( 47189, 47181, 47186, 47212, 47183, 47185, 47190, 47217) తాత్కాలికంగా రద్దయ్యాయి.
– సికింద్రాబాద్ టూ లింగంపల్లి వెళ్లే ఒక ఎంఎంటీఎస్ సర్వీసు ( 47150).
– లింగంపల్లి టూ సికింద్రాబాద్ వెళ్లే ఒక ఎంఎంటీఎస్ సర్వీసు (47195).
– రామచంద్రాపురం టూ ఫలక్నూమ వెళ్లే ఒక సర్వీసు (47177).
– ఫలక్నూమ టూ రామచంద్రపురం సర్వీసు (47218).
– ఫలక్నూమ టూ హైదరాబాద్ ఎంఎంటీఎస్ సర్వీసు (47201)ను మూడు రోజులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







