ఐఫోన్ ఆర్డర్ చేసి.. డబ్బులులేక డెలివరీ బాయ్ హత్య
- February 20, 2023
బెంగళూరు; కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.యాపిల్ ఐ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ చేశాడు 20 ఏళ్ల వ్యక్తి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకున్నాడు.ఈ-కార్ట్ డెలివరీ బోయ్ ఐఫోన్ ను తీసుకువచ్చాడు. డబ్బులు చెల్లించి తీసుకోవాల్సిన యువకుడు.. తన దగ్గర చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో దారుణానికి పాల్పడ్డాడు.ఈ-కార్ట్ డెలివరీ బోయ్ ని హత్య చేశాడు. అతడి మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు తన ఇంట్లోనే రహస్యంగా ఉంచాడు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సమీపానికి తీసుకెళ్లి దహనం చేశాడు.
అంచ్ కొప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 11న కాలిన శరీరం వెలుగు చూడడంతో దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. మరణించిన వ్యక్తిని హేమంత్ నాయక్ (23)గా గుర్తించారు. ఈ కార్ట్ ఎక్స్ ప్రెస్ ఉద్యోగిగా దర్యాప్తులో వెల్లడైంది.లక్ష్మీపుర లే అవుట్ సమీపంలో నివాసం ఉండే హేమంత్ దత్తా సెకండ్ హ్యాండ్ ఐఫోన్ ను బుక్ చేసుకోగా, దాన్ని డెలివరీ చేసేందుకు ఈ నెల 7న హేమంత్ నాయక్ వెళ్లాడు. రూ.46,000 చెల్లించాలని నాయక్ కోరడంతో… దత్తా కత్తితో దాడి చేసి హతమార్చాడు.మృతదేహాన్ని ప్యాక్ చేసి బండిపై పెట్టుకుని, రైల్వే స్టేషన్ సమీపంలో దహనం చేసినట్టు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ రికార్డుల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







