రాత్రి పూట ఈ పండ్లు తింటున్నారా.? తస్మాత్ జాగ్రత్త.!

- February 20, 2023 , by Maagulf
రాత్రి పూట ఈ పండ్లు తింటున్నారా.? తస్మాత్ జాగ్రత్త.!

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ్. పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండడంతో పాటూ, సి విటమిన్ తదితర ఇతరత్రా విటమిన్లు అధికంగా వుంటాయ్. అందుకే డాక్టర్లు సైతం రోజూ ఒక పండు తినమని సూచిస్తుంటారు. 
అయితే, కొన్ని రకాల పండ్లు కొన్ని వేళల్లో తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కంటే హాని ఎక్కువగా జరుగుతుందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
అరటి పండును రెగ్యులర్‌గా తీసుకున్నా ఎలాంటి ప్రమాదమూ లేదు. అలాగే యాపిల్, దానిమ్మ తదితర పండ్లను ఏ టైమ్‌లో తీసుకున్నా సమస్య లేదు. 
కానీ, ద్రాక్ష, పైనాపిల్ (అనాస) పండ్లను రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెబుతున్నారు. ద్రాక్ష, పైనాపిల్ పండ్లకు త్వరగా జీర్ణమయ్యే శక్తి చాలా తక్కువ. అందుకే, వాటిని రాత్రి పూట తీసుకుంటే, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయట. అలాగే, గ్యాస్ ఫామ్ అవ్వడం వంటి అననుకూల పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెబుతున్నారు. అందుకే రాత్రి పూట వీలైనంత వరకూ ఈ పండ్లకు దూరంగా వుంటే మంచిది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com