విశ్వక్ సేన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడా.?

- February 20, 2023 , by Maagulf
విశ్వక్ సేన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడా.?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన సినిమాతో ఏదో మ్యాజిక్ చేస్తుంటాడు. సినిమా ప్రమోషన్లని విచిత్రంగా డిజైన్ చేసుకుంటాడు. అన్నీ కలిసొస్తే.. ఈ పాటికి మనోడు నటించిన ‘ధమ్కీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి వుండేది. ఫిబ్రవరి 17న ‘ధమ్కీ’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ, అనుకోకుండా వాయిదా పడింది. 
దాంతో ఏప్రిల్‌కి పోస్ట్ పోన్ అయ్యింది ‘ధమ్కీ’. ఈ సినిమాని విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, నిర్మాణంలోనూ విశ్వక్ సేన్ భాగస్వామ్యం వుంది. ‘పాగల్’ కోసం విశ్వక్ సేన్‌తో జత కట్టిన నివేదా పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
కాగా, ఫిబ్రవరిలో సినిమా రిలీజై వుంటే, విశ్వక్ సేన్‌కి బాగా కలిసొచ్చేదని అంటున్నారు. ఫిబ్రవరిలో చెప్పుకోదగ్గ సినిమాలేమీ రిలీజ్ కాలేదు. సమంత ‘శాకుంతలం’ వాయిదా పడడం, ధనుష్ నటించిన ‘సార్’ డబ్బింగ్ చిత్రాల లిస్టులో పడడంతో డ్రై మంత్‌గా మిగిలిపోయింది. ఈ ఛాన్స్ విశ్వక్ ‌సేన్ యూజ్ చేసుకుని వుంటే బాగుండేదని ఆయన అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com