‘వినోదయ సిత్తం’ అలా కన్ఫామ్ చేశారా.?
- February 21, 2023
తమిళ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘వినోదయ సిత్తం’ సినిమాని పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ డైరెక్టర్ అయిన సముద్ర ఖని ఈ సినిమాని తెలుగులోనూ డైరెక్ట్ చేయబోతున్నారు. కాగా, ఈ ప్రాజెక్ట్‌పై ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రాజెక్ట్ అయితే కన్ఫామ్ అయ్యింది కానీ, మేకర్ల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఈ సినిమా గురించి సీనియర్ నటుడు తనికెళ్ల భరణి అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోందని ఆయన ఓ ఈవెంట్ సందర్భంగా పవన్ ఫ్యాన్స్‌కి తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటూ, ఈ సినిమాలో మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. మొన్నా మధ్య ఓ సినిమా ఈవెంట్లో ఈ ప్రాజెక్ట్ గురించి అడిగితే, తేజు మాట దాటేసిన సంగతి తెలిసిందే.
ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్ అతి త్వరలోనే పట్టాలెక్కనుందని మాత్రం తెలుస్తోంది. ఈ సినిమా కోసం కేవలం 20 రోజులు మాత్రమే డేట్లు కేటాయించాడట పవన్ కళ్యాణ్.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు