భారత సైనికాధికారులపై నిఘాపెట్టిన ఐఎస్‌ఐ

- May 03, 2016 , by Maagulf
భారత సైనికాధికారులపై నిఘాపెట్టిన ఐఎస్‌ఐ

పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ భారత సైనిక అధికారులపై నిఘా పెట్టింది. స్మార్ట్‌ఫోన్లలోని గేమింగ్‌, మ్యూజిక్‌ అప్లికేషన్ల ద్వారా మొబైల్‌ ఫోన్లలోకి మాల్‌వేర్‌ను చొప్పించి సమాచారం సేకరిస్తోందని ప్రభుత్వం హెచ్చరించింది. దీనికోసం టాప్‌గన్‌, ఎంపీజంకీ, వీడీ జంకీ, టాకింగ్‌ ఫ్రాగ్‌ వంటి అప్లికేషన్లను వాడుకుంటోందని ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రి హరిభాయ్‌ పార్థిభాయ్‌ చౌదరి తెలిపారు.
పాకిస్థానీ నిఘా ఏజన్సీలు ముఖ్యంగా ఎక్స్‌సర్వీస్‌మెన్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నాయని తెలిపారు. వారికి ఉద్యోగాలు, ఆర్థిక సాయం ఎర చూపి వారిని వాడుకుంటున్నాయని ఆయన చెప్పారు. ఐఎస్‌ఐ మాల్‌వేర్‌ మొబైల్‌ యాప్‌లను పంపిస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని ఆయన చెప్పారు. 2013-16 మధ్య కాలంలో దాదాపు ఏడుగురు ఎక్స్‌సర్వీస్‌మెన్‌ని గూఢచర్యం కేసుల్లో అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com