ఎమిరేట్స్ ఐడీ: వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌ను ఖండించిన అథారిటీ
- February 23, 2023
యూఏఈ: ఎమిరేట్స్ IDకి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్‌ను యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) తిరస్కరించింది. గల్ఫ్ పౌరులు కేవలం రుసుము చెల్లించి ఎమిరేట్స్ ఐడి కార్డును పొందవచ్చని పోస్ట్‌లో ఉందని, ఆ సమాచారం అవాస్తవమని గురువారం ఉదయం జారీ చేసిన హెచ్చరికలో అధికార యంత్రాంగం వెల్లడించింది. ఈ మేరకు వైరలవుతున్న పలు పోస్టులను ఈ సందర్భంగా షేర్ చేసింది. "ఎమిరేట్స్ ID కార్డ్ పొందడానికి జనాభా రిజిస్ట్రీకి అవసరాలను పూర్తి చేయడం అవసరం" అని ICP తెలిపింది. ఈ విషయంలో జారీ చేయబడిన నియంత్రణ నిర్ణయాలకు అనుగుణంగా కార్డ్‌ని పొందడం నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుందని, కార్డుల జారీలో ఏ మార్పులకు గురికాలేదని ICP జోడించింది. వైరలవుతున్న పోస్టుల్లో పేర్కొన్న పుకార్లను పట్టించుకోవద్దని, ధృవీకరించబడిన ఛానెల్‌లు, అధికారిక ప్రభుత్వ వనరుల నుండి సరైన సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని నివాసితులకు అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







